Sun Dec 22 2024 23:34:42 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళుతుండగా కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు నుంచి...
నలుగురిలో ఇద్దరు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. తమ్మలపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరనేది ఇంకా గుర్తించలేదు.
Next Story