Mon Dec 23 2024 11:24:06 GMT+0000 (Coordinated Universal Time)
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇద్దరు మృతి....
గాయపడిన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్ నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Next Story