Thu Dec 19 2024 16:48:45 GMT+0000 (Coordinated Universal Time)
నల్లగొండలో కాల్పులు... యువకుడి పరిస్థితి విషమం
నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. బైక్ పై వెళుతున్న యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. బైక్ పై వెళుతున్న యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిమ్మల లింగస్వామి అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ గొడవలే ఈ కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
రియల్ ఎస్టేట్....
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణవెల్లంల గ్రామనికి చెందిన లింగస్వామి మునుగోడులో కూల్ డ్రింక్స్ విక్రయించే షాపు నిర్వహించుకుంటున్నాడు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అయితే దుకాణం మూసివేసి బైక్ పై ఇంటికి వెళుతుండగా మునుగోడు మండలం సింగారం వద్ద ఈ కాల్పులు దుండగులు జరిపారు. లింగస్వామి చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న లింగస్వామిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story