Mon Dec 23 2024 11:45:56 GMT+0000 (Coordinated Universal Time)
మొబైల్ ఛార్జింగ్ పెట్టి తీస్తుండగా.. మృతి
మొబైల్ ఛార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి ఒక బాలిక మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది
మొబైల్ ఛార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి ఒక బాలిక మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. పదేళ్ల నీహారిక మొబైల్ ను చార్జింగ్ పెట్టి దానిని తీస్తుండగా విద్యుత్తు షాక్ తగలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్తు షాక్ తోనే...
వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే నీహారిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఈడిగోనిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story