Mon Dec 23 2024 13:11:09 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్టులో తుపాకీ కలకలం
ఢిల్లీ ఎయిర్ పోర్టులో తుపాకీ కలకలం రేగింది. ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు పిస్టల్ ను గుర్తించారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో తుపాకీ కలకలం రేగింది. ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు పిస్టల్ ను గుర్తించారు. దానిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి బ్యాగ్ లో పిస్టల్ తో పాటు రెండు మ్యాగ్ జైన్ లను ఉండటం కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సెక్యూరిటీ లోపం....
అయితే పిస్టల్ తో విమానంలోకి ఎలా అనుమతిచ్చారన్న దానిపై కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. సెక్యూరిటీ లోపం వల్లనే ప్రయాణికుడు పిస్టల్ తో ప్రయాణం చేశారని భావిస్తున్నారు. దీనిపై కస్టమ్స్ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story