Thu Dec 19 2024 08:36:44 GMT+0000 (Coordinated Universal Time)
భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల మృతి
జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు
జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు వెల్లడించారు.
ఇద్దరు అదుపులోకి...
మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న బలగాలు వారిని విచారిస్తున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్నసమాచారంతో భద్రతాదళాలు అక్కడకు వెళ్లగా ఎదురుకాల్పులు జరిగాయి.అయితే మరణించిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా భద్రతాదళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.
Next Story