Wed Mar 26 2025 19:12:18 GMT+0000 (Coordinated Universal Time)
అసోంలో భారీ అగ్నిప్రమాదం
అసోంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు వందల దుకాణాలు దగ్దమయ్యాయి

అసోంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు వందల దుకాణాలు దగ్దమయ్యాయి. ఒక వాణిజ్య కాంప్లెక్స్ లో చెలరేగిన ఈ మంటలను అదుపు చేసేందుకు ఇరవై ఐదు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. జోర్హాట్ చౌక్ బజార్ లోని కమర్షియల్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.
ఐదు వందల షాపులు...
కానీ అప్పటికే ఐదు వందల షాపులు దగ్దమయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం సంభవించినట్లు దుకాణాదారులు చెబుతున్నారు. మొత్తం ఇరవై ఐదు ఫైర్ ఇంజిన్లతో చివరకు మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయగలిగారు. ఒక వస్త్ర దుకాణంలో ప్రారంభమైన మంటలు వెంటనే వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తాము అన్ని విధాలుగా నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story