Mon Dec 23 2024 04:34:26 GMT+0000 (Coordinated Universal Time)
Delhi liquor Scam : కీలక పరిణామం.. ఈడీకి షాక్
డీల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది
డీల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇటీవల అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
కవితకు బినామీనంటూ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాను బినామీనంటూ ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధకారుల విచారణలో ఇచ్చిన వాంగ్మూలంలో రామచంద్ర పిళ్లై పేర్కొన్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగానే రేపు కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. తాజాగా ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని.. దీనికి అనుమతించాలని ఆయన కోరారు. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది.
Next Story