Mon Dec 23 2024 12:24:55 GMT+0000 (Coordinated Universal Time)
విధ్వంసం కేసులో ఎఫ్ఎస్ఎల్ కు స్మార్ట్ ఫోన్లు
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 63 స్మార్ట్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 63 స్మార్ట్ ఫోన్లను అధికారులు ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత రైల్వే పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆర్మీ శిక్షణ పొందుతున్న యువకులు కొందరు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
400 మంది నుంచి....
రైల్వే విధ్వంసం కేసులో 64 మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. 63 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 63 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నేడు ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపారు. ఈ ఘటనలో 400 మంి వాట్సాప్ గ్రూపు సభ్యుల వాంగ్మూలాలను రైల్వే పోలీసులు రికార్డు చేశారు. త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు.
Next Story