Thu Dec 26 2024 17:50:07 GMT+0000 (Coordinated Universal Time)
రెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
అరేబియా సముద్ర మార్గంలో పెద్దయెత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అరేబియా సముద్ర మార్గంలో పెద్దయెత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ, పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 800 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రెండు వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
800 కిలోల హెరాయిన్ ను...
సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ ను భారత్ లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్ఐఏ అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏ ఏ రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ఈ డ్రగ్స్ తీసుకు వస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద యెత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
- Tags
- drugs
- arabian sea
Next Story