Fri Dec 20 2024 22:08:53 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ కాల్వలో దూకిన ప్రేమజంట
ప్రేమకు పెద్దలు అంగీకరరించలేదని ఒక ప్రేమ జంట కాల్వలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది
ప్రేమకు పెద్దలు అంగీకరరించలేదని ఒక ప్రేమ జంట కాల్వలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో యువతిని స్థానికులు కాపాడగా యువకుడు మాత్రం నీటిలో కొట్టుకుపోయారు. ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నల్లగొండ జిల్లా హాలియా వద్ద ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా పీఏ పల్లికి చెందిన బాలకృష్ణ తన మరదలిని ప్రేమించాడు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించేలేదు.
యువకుడు మాత్రం....
దీంతో ఈరోజు ఉదయం ఇద్దరూ హాలియా వచ్చి సాగర్ కాల్వలోకి దూకారు. అయితే గమనించిన స్థానికులు తాడు సాయంతో యువతిని కాపాడగలిగారు. ఈ ఘటనలో బాలకృష్ణ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
Next Story