Mon Dec 23 2024 07:57:31 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటికి నిప్పుపెట్టిన బంధువులు
కర్నూలు జిల్లాలో ప్రేమ పెళ్లి రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ప్రేమించిన యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు
కర్నూలు జిల్లాలో ప్రేమ పెళ్లి రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ప్రేమించిన యువకుడి ఇంటికి యువతి కుటుంబీకులు నిప్పుపెట్టారు. మంత్రాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాధవరానికి చెందిన బోయ శ్రీజ రచ్చమర్రి గ్రామానికి చెందిన భీమ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. అయితే శ్రీజకు వేరే వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు.
వస్తువులన్నీ.....
దీంతో ఆగ్రహానికి గురైన యువతి శ్రీజ కుటుంబీకులు పెళ్లి కొడుకు ఇంటిని తగులుబెట్టారు. ఇంట్లో వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు గ్రామల మధ్య కూడా ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story