Tue Dec 24 2024 02:28:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, అధిక సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. అయితే వెంటనే స్థానికులు స్పందించి 15 మంది ప్రయాణికులను రక్షించగలిగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఇండోర్ నుంచి...
థార్ జిల్లా ఖాలాఘాట్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఇండోర్ నుంచి పూనే వెళుతుండగా బస్సు లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులున్నారు. 24 మంది ప్రయాణికుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మరికొన్ని మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story