Mon Dec 23 2024 09:39:29 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురంలో దారుణం.. అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిఠాపురం విద్యుత్ నగర్ లో అత్తను అతి దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటున్న అత్తపై తన కోపాన్ని ప్రదర్శించాడు. అతి దారుణంగా చంపేసి.. పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోయాడు.

రమేష్ గత కొద్దిరోజులుగా భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తన భార్యను అత్తారింటికి పంపకుండా ఆపుతోంది తన అత్తనే అని భావిస్తూ వస్తున్నాడు. చాలా సార్లు తన భార్యను పంపించాలని కోరాడు రమేష్. అయితే అతడి భార్య రావడం లేదు. దీనికంతటికీ కారణం తన అత్త అని రమేష్ భావించాడు. ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కస్సుతో రమేష్ తన అత్త రమణమ్మను చంపేయాలని భావించాడు. ఉదయం వాకిలి తుడిచేందుకు ఇంటి బయటకు వచ్చిన రమణమ్మపై కత్తితో దాడికి పాల్పడ్డాడు రమేష్. అడ్డుకున్న మావ,బామ్మర్దికి గాయాలు కూడా అయ్యాయి. మామ, బామ్మర్దిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా రమణమ్మపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. రమణమ్మ రక్తపు మడుగులో పడి ఉండగా.. రమేష్ అక్కడే కూర్చుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి రమేష్ లొంగిపోయాడు.
Next Story