Mon Dec 23 2024 06:22:05 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడితో కలిసి భర్తను పకడ్బందీగా స్కెచ్ వేసి మర్డర్ కానీ..!
భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇనుప తీగతో గొంతుకోసి హత్య చేశారు. చంపా మాల్, ఆమె ప్రియుడు మాలిక్ తో కలిసి తన భర్త నితిన్ సనాతన్ మాల్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీలోని ధనియాఖలి గ్రామంలో ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు దారుణంగా హత్య చేశారు. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇనుప తీగతో గొంతుకోసి హత్య చేశారు. చంపా మాల్, ఆమె ప్రియుడు మాలిక్ తో కలిసి తన భర్త నితిన్ సనాతన్ మాల్ (46)ని వదిలించుకోవడానికి పథకం వేసి మర్డర్ కు ప్లాన్ చేసింది.
అదను చూసి ఉన్న సమయంలో.. సాయంత్రం నితిన్ సనాతన్ మాల్ ఇంటికి వచ్చాడు. చంపా అతనికి ఫుల్ గా మద్యం పోసేసింది. స్పృహ లేని స్థితిలోకి వెళ్లేలా అతనికి మద్యం ఇచ్చింది. ఇదే ఛాన్స్ అనుకున్న ఇద్దరు నిందితులు బాధితుడిని ఇనుప తీగతో గొంతుకోసి హత్య చేశారు. ఇక తమ నేరాన్ని కప్పిపుచ్చడానికి, వారు నితిన్ సనాతన్ మాల్ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి బావిలో పడేశారు. కొద్ది సమయానికి పోలీసులు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగలిగారు, ఆ తర్వాత వారు పోస్ట్మార్టం కోసం పంపించారు. కొద్దిరోజులుగా విచారించిన పోలీసులకు భార్య చంపాపై అనుమానం వచ్చింది. పోలీసులు చంపాను విచారించగా నిందితుడిని చంపింది ఎవరో.. ఎలా చంపామో అనే విషయాలను బయటపెట్టింది.
Next Story