Thu Dec 26 2024 16:59:44 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ చోరీ
కావూరి హిల్స్ లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లోని కావూరీ హిల్స్ ఒక వ్యాపారి ఇంట దుండగులు ప్రవేశించి చోరీ చేశారు
హైదరాబాద్ : కావూరి హిల్స్ లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లోని కావూరీ హిల్స్ ఒక వ్యాపారి ఇంట దుండగులు ప్రవేశించి చోరీ చేశారు. వ్యాపారి ఇంటికి తాళం వేసి ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, నగదును ఎత్తుకెళ్లారు. ఇరవై లక్షల నగదుతో పాటు ముప్పయి లక్షల విలువైన వజ్రాలను దొంగలు తీసుకెళ్లినట్లు వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు రెక్కీ నిర్వహించి చోరీ చేశారని పోలీసులు భావిస్తున్నారు.
సీసీ కెమెరాలు...
సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వ్యాపారి ఇంట్లో పనిమనుషులను కూడా అనుమానిస్తున్నారు. వారిని విచారించాలని వ్యాపారి కూడా కోరడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు ఈ చోరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నీ తెలిసిన వారే ఈ పనిచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story