Tue Dec 24 2024 13:43:09 GMT+0000 (Coordinated Universal Time)
దారితప్పిన తల్లి దారుణం.. ప్రియుడి కోసం పసిబిడ్డ హత్య, ఒక్క ఫోన్ కాల్తో.!
ఏపీలోని విజయవాడ నగరం భవానీపురానికి చెందిన గురునాథం, దుర్గా భవానీ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కూతుళ్లు..
అమ్మ అనే మాటకే కళంకం తెచ్చిందో మహిళ. పడక సుఖం కోసం పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను పాశవికంగా హతమార్చింది. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉందన్న అక్కసుతో అమానుషంగా అంతమొందించింది. కనీస కనికరం లేకుండా బిడ్డను మూటగట్టి అటవీ ప్రాంతంలో విసిరి పారేసింది. ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకునేలోపు ఒక్క ఫోన్ కాల్తో అడ్డంగా దొరికిపోయింది. ఈ అత్యంత దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. సేకరించిన వివరాల మేరకు..
ఏపీలోని విజయవాడ నగరం భవానీపురానికి చెందిన గురునాథం, దుర్గా భవానీ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కూతుళ్లు నాగలక్ష్మి(6), గీతమాధవి(14 నెలలు). గత కొద్దిరోజులుగా భర్తతో గొడవపడుతున్న దుర్గా భవానీ గత నెల 14 నుంచి కనిపించకుండా పోయింది. తన ఇద్దరు పిల్లలతో సహా భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కంగారుపడిన భర్త చుట్టుపక్కల వెతికాడు. బంధువుల వద్ద ఆరా తీశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భవానీపురం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.
తన ఇద్దరు పిల్లలలో దుర్గా భవానీ నిజామాబాద్ వెళ్లింది. అక్కడే ఆమెకు డేరంగుల శ్రీను పరిచయమయ్యాడు. అతనితో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. కొద్దిరోజులు రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనే ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు తన ఆరేళ్ల కూతురు అడ్డుగా ఉందని భావించిన కసాయి తల్లి నీచానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఆమెను ఈ నెల 22న గొంతునులిమి చంపేసింది. అనంతరం చిన్నారి డెడ్బాడీని మూటగట్టి మక్లూర్ సమీపంలోని చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో ఓ గుంతలో పడేసి చేతులు దులుపుకుంది.
అనూహ్యంగా నాలుగు రోజుల కిందట దుర్గా భవానీ తన తల్లికి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడగడంతో కథ అడ్డం తిరిగింది. దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నుంచి ఫోన్ వచ్చిందని తెలుసుకుని భర్త గురునాథం నేరుగా అక్కడికి వెళ్లాడు. చుట్టుపక్కల గాలించగా రైల్వే స్టేషన్లో భార్య దుర్గాభవానీ కనిపించింది. కూతురు నాగలక్ష్మి ఎక్కడని ప్రశ్నించడంతో బంధువుల వద్ద ఉందని అబద్ధాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించింది. ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో ప్రియుడి వ్యవవహారం బయటపడింది. కూతురును హత్య చేసినట్లు చెప్పేసింది.
దీంతో వెంటనే భర్త గురునాథం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. అటవీ ప్రాంతంలో చిన్నారి డెడ్బాడీని వెలికితీసి పోస్టుమార్టం చేయించి అంత్యక్రియలు నిర్వహించారు. పడక సుఖం కోసం పసిబిడ్డను బలి తీసుకున్న దుర్గార్గులను అరెస్టు చేశారు. గతంలో గురునాథం దంపతులు తాపీ పనుల కోసం వచ్చి నిర్మల్లో కొన్నేళ్లు నివాసమున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల కిందట అక్కడి నుంచి విజయవాడ భవానీపురానికి మకాం మార్చినట్లు సమాచారం.
Next Story