Mon Nov 25 2024 16:28:56 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ప్రమాదంలో కొత్తకోణం... యూట్యూబర్ కారణమా?
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాత్రి లంగరు వేసిన బోటులో ఒక యూట్యూబర్ మద్యం పార్టీ ఇచ్చారని పోలీసులకు సమాచారం అందింది. మద్యం పార్టీ సందర్భంగా అక్కడ ఘర్షణ కూడా జరిగిందని తెలిపింది. దీంతో యూట్యూబర్ కోసం వెతుకుతున్నారు. మద్యం మత్తులో ఘర్షణ పడి ఈ ప్రమాదానికి కారణమా? లేక మరేదైనా? అన్నది మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. నిన్న అర్థరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నలభై మత్స్య కారుల బోటు తగలబడి కోట్ల రూపాయల నష్టం వాటిల్లి నట్లు తెలిసింది. యూట్యూబర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు నలభై కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
జగన్ దిగ్భ్రాంతి...
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. వాస్తవ కారణాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Next Story