Thu Nov 07 2024 21:48:02 GMT+0000 (Coordinated Universal Time)
వివేకాను చంపింది వారేనని చెప్పాలంటూ సీబీఐ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖుల పేర్లు చెప్పాలని తనపై సీబీఐ వత్తిడి తెస్తుందంటూ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసు అధికారిని కలవడం చర్చనీయాంశమైంది. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీ ఫకీరప్పను గంగాధర్ రెడ్డి కలిశారు. తనకు పది కోట్ల రూపాయలు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందని గంగాధర్ రెడ్డి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రక్షణ కల్పిస్తాం....
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకరరెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలంటూ తనపై సీబీఐ వత్తిడి తెస్తుందన్నారు. తానే వివేకాను చంపానని ఒప్పుకోవలంటూ సీబీఐ అధికారులు తనపై వత్తిడి తెచ్చారన్నారు. దీనిపై ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, అతనికి రక్షణ కల్పిస్తామని, డీఎస్పీ స్థాయి అధికారులతో ఆ ఫిర్యాదుపై విచారణ చేయిస్తామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
Next Story