Mon Dec 23 2024 09:30:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా మఠంపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేవీ పల్లి మండలం మఠంపల్లి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఐదుగురు మృతి...
తుఫాను వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. కర్ణాటకలోని బెల్గాం అత్తిని కి చెంిన పదహారు మంది ఈ వాహనంలో ప్రయాణిస్తున్నారు. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. పదకొండు మంది తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తులో అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.
Next Story