Mon Dec 23 2024 08:42:11 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు ఆటోను, బైక్ ను ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు ఆటోను, బైక్ ను ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. గుజరాత్ లోని ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు కేతన్ పదియార్ కారును వేగంగా నడిపి ఆరుగురిని బలి తీసుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడు కారు దిగి పారిపోయాడు. కేతన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే అల్లుడు...
అతివేగంగా వచ్చి కారును ఆటోను, ఒక బైకును ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నలుగురు, బైక్ పై ఉన్న ఇద్దరూ మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో అతనిని ఆసుపత్రిలోకి చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. మృతులంతా సోజిత్రా, బోరియావీ గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేతన్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story