Sun Dec 22 2024 18:07:05 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురి మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కులులో ఈ ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఒక వాహనం అదుపుతప్పి వాగులో పడిపోయింది.
లోయలో పడి...
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల్లో ఎక్కువ మంి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story