Mon Dec 15 2025 06:40:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం....ఏడుగురి మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కర్ణాటకలోని కాలాబురిగి దగ్గర టెంపోను ఒక ప్రయివేటు బస్సు ఢీకొనింది. ప్రమాదరం జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని పోలీసు అధికారులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య.....
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అందులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు? అన్న పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలియరానుంది.
Next Story

