Mon Dec 23 2024 04:57:51 GMT+0000 (Coordinated Universal Time)
అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ముగ్గురికి తీవ్ర గాయాలు...
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story