Tue Mar 11 2025 05:10:08 GMT+0000 (Coordinated Universal Time)
ఓఆర్ఆర్పై లారీ బీభత్సం : ముగ్గురి మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూరు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూరు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కొల్లూరు దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న గుడెసెల్లోకి లారీ వేగంగా దూసుకెళ్లింది. బోల్తా పడింది.
అదుపుతప్పి...
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. పటాన్చెరు నుంచి శంషాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story