Wed Apr 02 2025 19:47:05 GMT+0000 (Coordinated Universal Time)
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, జీపు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, జీపు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. శ్రీసత్యసాయి జిల్ల బత్తులపల్లి మండలం పోట్లపర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అతివేగం...
మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాకున్నా అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story