Mon Dec 23 2024 04:25:16 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వర్థన్నపేట మండలం డీసీ తండా వద్ద ఈ ఘటన జరిగింది. ఒంగోలు నుంచి వరంగల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.
ఒంగోలు నుంచి...
ఆగి ఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయి మరణించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story