Sun Dec 22 2024 07:55:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ముందు వెళుతున్న కంటెయినర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపై జరుగడంతో ట్రాఫిక్ కు కొంత అంతరాయం ఏర్పడింది.
అతి వేగమే...
రాత్రి వేళ అతి వేగంతో వస్తున్న కారు ముందు వెళుతున్న కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నలుగురు మృతి చెందగా ఒకరికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. హైదరాబాద్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story