Mon Dec 23 2024 08:43:26 GMT+0000 (Coordinated Universal Time)
అనంతలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
అనంతపురం జిల్లాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
అనంతపురం జిల్లాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కల్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైకు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
వేగంగా వచ్చి....
మరణించిన వారు బాలు, విక్కీగా గర్తించారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. వేగంగా వచ్చి ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story