Fri Dec 27 2024 13:45:34 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది.
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. అయితే మృతులు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే భయపడిపోయిన ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అతివేగమేనా?
అతి వేగంతో ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ మద్యం తాగి వాహనం డ్రైవ్ చేశాడా? అన్నది తెలియదు. ముగ్గురు అమాయకుల ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పారిపోయిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రక్కు నెంబరు ఆధారంగా డ్రైవర్ ను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Next Story