Thu Dec 19 2024 13:15:20 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
రాజస్థాన్లోని జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు.
రాజస్థాన్లోని జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో పద్దెనిమిది మంది వరకూ గాయపడ్డారు. రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలోని పింద్వారా ప్రాంతంలో నిన్న రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జీపును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పరిమితికి మించి...
అయితే జీపులో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులున్నందున మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొని ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story