Thu Jan 02 2025 20:49:31 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. హసన్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ ను ఒక లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
అతి వేగమే....
హసన్ జిల్లా గండి నగర్ బీరువా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం అతి వేగమేని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story