Mon Dec 23 2024 12:59:17 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద లారీ ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ముగ్గురూ రాయదుర్గం వాసులుగా పోలీసులు గుర్తించారు.
మృతులు వీరే...
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు రుద్ర, గణేష్, సోమశేఖర్ లుగా పోలీసులు చెబుతున్నారు. కారును ఢీకొట్టిన లారీ వేగంగా వెళ్లిపోయింది. లారీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story