Mon Dec 15 2025 03:53:54 GMT+0000 (Coordinated Universal Time)
నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం ...ఇద్దరు యువకుల మృతి
నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.

నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ మండలలోని శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు మరణించారు.
అతి వేగమే...
పందొమ్మిదేళ్ల వంశీ, ఇరవై ఏళ్ల రాజేష్ అనే యువకులు మరో స్నేహితుడితో కలసి కారులో వెళుతుండగా లారీని ఒక్కసారి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో యువకుడు రాజేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

