Mon Dec 23 2024 04:32:51 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. హరిద్వార్ జిల్లాలోని బీరోంఖాల్ వద్ద అదుపుతప్పి నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 25 మంది మృతదేహాలను బయటకు తీశారు. తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో యాభై మంది వరకూ ఉన్నారు. హరిద్వార్ జిల్లాలోని లాల్గఢ్ నుంచి పెళ్లి బృందంతో బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది.
పెళ్లికి వెళుతూ...
లాల్గఢ్ కు చెందిన నందరామ్ వివాహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బస్సులో బయలుదేరారు. బోరాఖాల్ ప్రాంతంలని సిమ్డీ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి బస్సు అదుపుతప్పి లోయలో పడింది. నదిలో పడిన బస్సులో ఎక్కువ మంది అక్కడికక్కడే మరణించారు. సహాయక చర్యలు వెంటనే చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. 25 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story