Fri Dec 20 2024 16:38:59 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తరప్రదేశ్ లో విషాదం.. 9 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి 9 మంది మరణించారు. లక్నోలో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది
ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి 9 మంది మరణించారు. లక్నోలో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. ఈ ఘటనలో ొందరు గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానికులు, పోలీసులు కలసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లక్నోలోని దిల్ కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని స్థానికులు చెబుతున్నారు.
గోడ కూలి.....
మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story