Fri Nov 15 2024 12:33:36 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదం : ముగ్గురి మృతి
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొరేయ్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొరేయ్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పతి స్టేషన్ లోకి రావడంతో ముగ్గురు మృతి చెందారు. గూడ్స్ రైలు స్టేషన్ లోని వెయిటింగ్ హాలులోకి దూసుకు రావడంతో ముగ్గురు ప్రయాణికులు దాని కింద పడి అక్కడిక్కడే మరణించారు. పట్టాలు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడించారు.
అత్యున్నత స్థాయి దర్యాప్తు...
సహాయక చర్యలను అధికారులు చేపట్టారు. భద్రక్ నుంచి కటక్ వెళుతున్న గూడ్స్ రైలు అకస్మాత్తుగా స్టేషన్ లోకి దూసుకు రావడంతో ప్రయాణికులు భయకంపితులై పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. పది బోగీలు ప్లాట్‌ఫారంపైకి దూసుకు వచ్చాయి.
Next Story