Fri Dec 27 2024 20:45:30 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాస్స్ మధ్య ఘర్షణ : ఒకరి మృతి
ప్రభాస్, పవన్ కల్యాణ్ అభిమాని మధ్య మాట మాట పెరిగి చివరకు ఘర్షణకు దారి తీసి హత్యగా మారింది
సినీ హీరోలపై అభిమానం ఉండొచ్చు. కానీ హత్య చేసుకునే వరకు వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలో అదే జరిగింది. ప్రభాస్, పవన్ కల్యాణ్ అభిమాని మధ్య మాట మాట పెరిగి చివరకు ఘర్షణకు దారి తీసి హత్యగా మారింది. ప్రభాస్ ఫొటోను తన స్టేటస్ గా పెట్టుకోమని మనె స్నేహితుడిని కోరాడు. దీని మధ్య మాట మాట పెరిగి హత్యకు దారి తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వాట్సప్ స్టేటస్ మార్చాలంటూ...
కిషోర్ పవన్ కల్యాణ్ అభిమాని, అతని స్నేహితుడు హరికుమార్ ప్రభాస్ ఫ్యాన్. ఇద్దరూ మంచి స్నేహితులే. అయితే పవన్ కల్యాణ్ ఫొటోను కిషోర్ తన స్టేటస్ గా పెట్టుకున్నాడు. అయితే హరికుమార్ ప్రభాస్ పెట్టుకోవాలని కోరాడు. కుదరదని చెప్పడంతో పక్కనే ఉన్న కర్రతో తలపై కొట్టగా అక్కడికక్కడే మరణించాడు. దీంతో భయపడి హరికుమార్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story