Wed Jan 15 2025 07:43:31 GMT+0000 (Coordinated Universal Time)
మహిళ ఉచ్చులో ముగ్గురు టాలీవుడ్ హీరోలు
హైదరాబాద్ లో ఒక మహిళ భారీ మోసానికి తెరలేపింది. సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఫైనాన్షియర్లను లక్ష్యంగా చేసుకుంది
హైదరాబాద్ లో ఒక మహిళ భారీ మోసానికి తెరలేపింది. సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఫైనాన్షియర్లను లక్ష్యంగా చేసుకుంది. ఫిర్యాదులు అందడంతో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో శిల్ప అనే మహిళ బడా పారిశ్రామికవేత్తలకు, సినీ ప్రముఖులకు, ఫైనాన్షియర్లను టార్గెట్ చేసింది. పేజ్ త్రీ పార్టీలతో వారిని ఆకట్టుకుంది. అధిక వడ్డీ ఇస్తానని చెప్పి కోట్లు వసూలు చేసింది.
పేజ్ త్రీ పార్టీలతో....
దీంతో శిల్ప అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలివుడ్ హీరోలు ఉన్నట్లు సమాచారం. అందరి వద్ద నుంచి శిల్ప సుమారు వంద నుంచి 200 కోట్లు వసూలు చేసిందని తెలిసింది. శిల్పా బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. ఆ ముగ్గురు టాలివుడ్ హీరోలు ఎవరన్నది తెలియకున్నా , శిల్పకు భారీ మొత్తంలోనే సొమ్ములు ఇచ్చినట్లు సమాచారం.
Next Story