Thu Dec 26 2024 20:51:50 GMT+0000 (Coordinated Universal Time)
డీజే సౌండ్ కు మహిళ బలి
డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా రాణి అనే మహిళ కుప్పకూలిపోయింది. పెళ్ళి ఊరేగింపులో డీజే శబ్దాల ధాటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాణీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుప్పకూలడంతో...
మృతురాలి స్వస్థలం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంగా చెబుతున్నారు. అయితే డీజే సౌండ్ వల్లనే మహిళ రాణి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు చెబుతున్నారు. డీజే సౌండ్ కు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
Next Story