Mon Dec 23 2024 02:11:18 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి చేసుకున్న మహిళ అతడి కోసం విడాకులు తీసుకుంది.. అతడేమో!!
మేము అప్పుడే రెస్టారెంట్ తెరిచాము. ఆ జంట అక్కడకు వచ్చేసరికి
పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి మహిళకి మాట ఇచ్చాడు. అయితే ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే ఎన్ని రోజులైనా ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశాడు. దీంతో ఆ మహిళ ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఉదయం రెస్టారెంట్లో మాట్లాడుకుందాం, కలవాలని అతడిని కోరడంతో అతడు అక్కడికి వచ్చాడు. కొన్ని నిమిషాల సంభాషణ తర్వాత ఆమె తన బ్యాగ్ నుండి ఒక సీసాని తీసి అందులో ఉన్న దాన్ని అతని ముఖం మీద కొట్టింది. అది యాసిడ్. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగిన ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి.
"అతను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అందుకే అతనిపై యాసిడ్ పోశాను. నేను అతనిని పెళ్లి చేసుకోలేదు. మరొకరిని పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత విడాకులు తీసుకున్నాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు." అని మహిళ ఆరోపించింది. వివేక్ అనే వ్యక్తి చేతికి కాలిన గాయాలయ్యాయి. పోలీసులు వచ్చేలోపు అతను తన చొక్కా తీసి రెస్టారెంట్ నుండి పారిపోయాడు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"మేము అప్పుడే రెస్టారెంట్ తెరిచాము. ఆ జంట అక్కడకు వచ్చేసరికి మేము రెస్టారెంట్‌ని శుభ్రం చేస్తున్నాం. బయట కూర్చున్న ఆమె తర్వాత లోపలికి వచ్చింది. ఐదు నిమిషాల తరువాత, ఒక వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చాడు. వారు దోసె, చోలే భటుర్ ఆర్డర్ చేసారు. ఆ తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి సార్, ఏం జరిగిందో చూడండి అంటూ అరిచాడు." అని రెస్టారెంట్ మేనేజర్ జరిగిన ఘటన గురించి చెప్పారు. ఆ వ్యక్తి తనను కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అందుకే అతనిపై యాసిడ్ పోశానని ఆ యువతి తమతో చెప్పిందని మేనేజర్ వెల్లడించారు.

Next Story