Thu Dec 26 2024 14:44:09 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ప్రియుడు ఆత్మహత్య
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమెతో ఉన్న వ్యక్తి ఇంటికెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమెతో ఉన్న వ్యక్తి ఇంటికెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీడీ కాలనీలో ఉంటున్న ఈ జంట శనివారం తెల్లవారుజామున వేరే ఊరి నుంచి ద్విచక్ర వాహనంపై ఏలూరుకి తిరిగి వస్తున్నారు.
ఇంటికెళ్లి ఉరేసుకుని....
ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. వెంటనే ఆమెతోపాటు ఉన్న వ్యక్తి తన ఇంటికెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ ఘటనల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story