Mon Dec 23 2024 09:35:23 GMT+0000 (Coordinated Universal Time)
టోలిచౌకిలో ఫ్లై ఓవర్ పై నుంచి పడి యువకుడు మృతి
బుల్లెట్ అదుపుతప్పడంతో.. వాహనాన్ని నడుపుతున్న యువకుడికి రెయిలింగ్ రాడ్ తగిలి ఫ్లై ఓవర్ పై నుంచి పడి..
హైదరాబాద్ : టోలిచౌకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బుల్లెట్ వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు ఫ్లై ఓవర్ పై నుంచి పడి మృతి చెందాడు. గోల్కొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుప్రమాదం జరిగింది. గోల్కొండ పాత బ్రిడ్జిపై సర్పరాజ్(18) అనే యువకుడు బుల్లెట్ వాహనంపై వస్తున్నాడు. బుల్లెట్ అదుపుతప్పడంతో.. వాహనాన్ని నడుపుతున్న యువకుడికి రెయిలింగ్ రాడ్ తగిలి ఫ్లై ఓవర్ పై నుంచి పడి మృతి చెందాడు.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మృతుడు టోలిచౌకిలోని సాలార్ జంగ్ కాలనీకి చెందిన సర్పరాజ్ హుస్సేన్ గా గుర్తించారు. సర్పరాజ్ స్థానికంగా ఉన్న ఒక మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఏదో పని ఉందని తన యజమాని నుంచి వాహనాన్ని తీసుకుని టోలిచౌకి ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా.. యువకుడి రాష్ , నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సర్పరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story