Mon Dec 23 2024 20:25:16 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో యువతి అనుమానాస్పద మృతి
విశాఖ జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
విశాఖ జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన ఓ యువతి రెండ్రోజుల క్రితం అదృశ్యమయింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆదివారం సింహాచలం సమీపంలోని భైరవవాక దగ్గర్లో పాడుపడిన బావిలో యువతి శవమై కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టానికి పంపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఆనందపురం పీఎస్ పరిధిలో గల సొంట్యం గ్రామానికి చెందిన సిమ్మ భవాని (22) రోజూ మాదిరిగానే ఈ నెల 3వ తేదీన పనికోసమై ఆటో డ్రైవర్ రాజు ఆటోలో వెళ్లింది. ఉదయం అనగా ఇంటి నుంచి వెళ్లిన భవాని రాత్రైనా ఇంకా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆనందపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆదివారం భవాని శవమై కనిపించింది. దీంతో డ్రైవర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు
Next Story