Mon Dec 23 2024 12:15:02 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం : కాలేజీలో విద్యార్థినికి అబార్షన్.. మృతి
వెంటనే తల్లిని, పిండాన్ని సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తల్లి మరణించిందని వైద్యులు నిర్థారించారు. సమాచారం ..
కాలేజీలోనే విద్యార్థిని అబార్షన్ అయి.. కొద్దిసేపటికే ఆమె మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్రిపాడు మండలానికి చెందిన బాధిత 19 ఏళ్ల యువతి బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఏప్రిల్ 11న కాలేజీలోని ప్రాంగణంలో విద్యార్థులంతా ఉండగా.. యువతి మాత్రం తరగతి గదిలోనే ఉండి.. అంతా బయటికి వెళ్లాక గడియ పెట్టుకుంది.
లోపలున్న విద్యార్థిని ఎంతకూ బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా.. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ పక్కనే ఆరునెలల గర్భస్థ పిండం కనిపించింది. వెంటనే తల్లిని, పిండాన్ని సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తల్లి మరణించిందని వైద్యులు నిర్థారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. తోటి విద్యార్థుల నుండి వివరాలు సేకరించారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థినికి మామూలుగానే అబార్షన్ అయిందా లేక.. ఏదైనా వీడియో చూసి తనకు తానే అబార్షన్ చేసుకుందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మొబైల్ కాంటాక్ట్స్ ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారుడ్రైవర్ తో పరిచయం ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు.
Next Story