Sun Nov 17 2024 14:48:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీపీ ఇంట్లో ఏసీబీ.. బయటపడిన నోట్ల కట్టలు.. స్థిరాస్థి పత్రాలు
హైదరాబాద్ సీీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నేడు న్యాయస్థానంలో ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నేడు న్యాయస్థానంలో ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. నిన్నంతా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పెద్దయెత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న తెల్లవారు జామునుంచే ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పథ్నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి పెద్దయెత్తున నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయానికి మించి...
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసీపీ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అనేకచోట్ల స్థిరాస్థులు ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఐదు వందలరూపాయల నోట్ల కట్టలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్థుల విలువ 3.46 కోట్ల విలువ ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆయన సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే ఆయన పెద్దయెత్తున ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.
Next Story