Fri Nov 15 2024 02:00:21 GMT+0000 (Coordinated Universal Time)
Pune : బాబు లిక్కర్ తాగలేదట.. మంచోడని సర్టిఫికేట్ ఇచ్చిన ఈ వైద్యులను ఏమనాలి? ఈ ట్విస్ట్ విన్నారా?
పూనేలో మైనర్ చేసిన యాక్సిడెంట్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది
పూనేలో మైనర్ చేసిన యాక్సిడెంట్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసిన మైనర్ అసలు మద్యం సేవించలేదని ఫోరెన్సిక్ వైద్యులు రిపోర్టు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూనేలో ఒక రియల్టర్ కుమారుడు పూటుగా మద్యం సేవించి ఖరీదైన కారుతో ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మైనర్ తండ్రి రియల్టర్ కావడంతో పోలీసులను కూడా మేనేజ్ చేయగలిగాడు. తన డ్రైవర్ ఆ యాక్సిడెంట్ చేశాడని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టును కూడా తన కుమారుడికి అనుకూలంగా మలచుకోగలిగాడు. అసలు మైనర్ మద్యం తాగలేదని ఫోరెన్సిక్ వైద్యులు నివేదిక ఇచ్చారు.
ఇద్దరు మరణించినా...
దీంతో సాసూన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హార్నూర్ ను పూనే క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి రక్తనమూనాల్లో ఎలాంటి మద్యం ఆనవాళ్లు లేవని నివేదిక ఇవ్వడంతో పోలీసులు ఇప్పటికే రిపోర్టు ఇచ్చిన వైద్యులను అరెస్ట్ చేశారు. డబ్బులుంటే ఎంతటి కేసైనా.. పోలీసులయినా.. డాక్టర్లనయినా మేనేజ్ చేయవచ్చన్న విషయం మరోసారి రుజువయింది. ఇదే మైనర్ తన మిత్రులతో కలిసి మద్యం తాగిన దృశ్యాలు సీసీటీవీలో లభ్యమయినా వైద్యులు మాత్రం ఆల్కహల్ ఆనవాలు లేవని చెప్పడం తో ఎవరిని నమ్మాలి? అన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు.
Next Story