Mon Dec 23 2024 18:36:53 GMT+0000 (Coordinated Universal Time)
27 మంది కార్మికులు మృతి
పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఏడు మంది కార్మికులు మృతి చెందారు.
పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఏడు మంది కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అతి పెద్ద విషాద ఘటన అని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు వెంటనే ప్రారంభమయినా కార్మికులను రక్షించలేకపోయారు.
వందల సంఖ్యలో...
అనేక మంది క్షతగాత్రులయ్యారు. గాయాలపాలయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. యానాక్విహువా పట్టణానికి సమీపంలో ఉన్న ఈ గనిలో వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది బయటకు సురక్షితంగా వచ్చారు. ఎవరు చిక్కుకుపోయారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story