Sun Dec 22 2024 13:49:44 GMT+0000 (Coordinated Universal Time)
Accident: ఏపీలో క్వారీ ప్రమాదం.. ముగ్గురు మృతి!!
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలోని ఓ క్వారీలో పనిచేస్తున్న కార్మికులపైన
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలోని ఓ క్వారీలో పనిచేస్తున్న కార్మికులపైన బండరాళ్లు పడ్డాయి. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు కార్మికుల ఆచూకీ దొరకాల్సి ఉంది. గల్లంతైన కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ముగ్గురు కార్మికులను క్షేమంగా బయటకు తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. మృతులు ముగ్గురూ జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
క్వారీపై నుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడటంతో రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున క్వార్ట్జ్ మైనింగ్ జరుగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి కంచికచర్ల వరకు అటవీ ప్రాంతాల్లో సైతం మైనింగ్ జరుగుతోంది. రోజులాగానే సోమవారం ఉదయం క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా బండరాళ్లు వాళ్లపై పడిపోయాయని తెలుస్తోంది.
Next Story