Thu Dec 26 2024 01:07:02 GMT+0000 (Coordinated Universal Time)
ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారును నడుపుతూ ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన ముగ్గురిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మద్యం మత్తులో....
రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జిరగింది. ప్రమాదం సమయంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి కారు డ్రైవ్ చేయడం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారులో డ్రైవర్ ప్రేమ్ తో పాటు గగన్, కాశీనాధ్, గోశఆల్, అమిత్ కుమార్, వైష్ణవి గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story